పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

0 12,590

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జె ఎస్ ఆర్ ఫంక్షన్ హల్ లో ఆదివారం నిర్వహించారు.  30 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించి ఆత్మీయ పలకరింపులు, భావోద్వేగాల మధ్య సమ్మేళనంచిన్ననాటి జ్ఞాపకాలతో స్నేహితులు మునిగితేలారు. ప్రతి మనిషి జీవితంలో చిన్న నాటి మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. చిన్ననాటి గిల్లికజ్జాలు, బుజ్జగింపులు, చిలిపి పనులు గుర్తుకు వచ్చినప్పుడల్లా ప్రతి మనిషిలో కలిగే ఆనందం అంత ఇంత ఉండదు. చిన్ననాటి స్నేహితులను కలిసి పాత రోజులను గుర్తు చేసుకోవడంలో భాగంగా ఈ మధ్యకాలంలో చాలామంది పూర్వ విద్యార్థుల సమ్మేళనాల పేరుతో అందరూ ఒక చోట కలిసి తమ మధురస్ముతులను స్మరించుకుంటున్నారు.  ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో గత 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలో 1995 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఎల్లారెడ్డి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కమ్యూనికేషన్ రంగం అభివృద్ధి చెందడంతో పాత స్నేహితుల సెల్ నెంబర్లు సేకరించిన స్థానిక మిత్రులు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సైతం ఈ సమ్మేళనానికి ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తమ గురువులకు శాలువా కప్పి పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ కళ్ళ ముందు చిన్న పిల్లలుగా విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు ప్రయోజకులుగా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్య నేర్పిన గురువులను సైతం గుర్తుంచుకొని వారిని వెతికి ఈ సమ్మేళనానికి ఆహ్వానించడం చాలా సంతోషం కలిగించిందన్నారు. మీ అందరిని చూస్తుంటే మీతో తరగతి గదిలో పాఠాలు చెప్పుతూ గడిపిన పాత రోజులే గుర్తుకొస్తున్నాయన్నారు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మరింత ఉన్నతి సాధించాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్సు పూర్తిగా ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు.ఈ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన గురువులు షర్పులక్ సార్ సార్,కిషన్ సార్, జగ్దేశ్వర్ సార్,కిష్టయ్య సార్  ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరిగా తమ చిన్ననాటి మధురస్ముతులను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు తరగతి గదిలో చేసిన అల్లరిని, ఆడిన ఆటలను గుర్తు చేసుకున్నారు. తమ ఆత్మీయ మిత్రుల వద్ద గత 30 సంవత్సరాలలో జరిగిన సంఘటనలను, కలిగిన బాధలను పంచుకున్నారు.  ఈ సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులందరికీ నిర్వాహక కమిటీ సభ్యులు జ్ఞాపికలను అందజేశారు. చివరకు తమ పాత స్నేహితులను వదిలిపోలేక, మళ్ళీ వచ్చే సంవత్సరం తప్పక కలుద్దామనే… చిన్న ఆశతో బరువైన హృదయాలతో ఒక్కొక్కరుగా సమ్మేళన ప్రాంగణం నుండి తరలి వెళ్ళిపోయారు.

Alumni reunion

Leave A Reply

Your email address will not be published.