29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ఓర్వలేకనే ఎమ్మెల్యే పై ఆరోపణలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : మొరం తవ్వకాల విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పై బీజేపీ   పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆరోపణలు  సరికాదని కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ చార్జి  కురువ రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ నియోజకవర్గం అభివృద్ధి ఓర్వలే కనే ఎమ్మెల్యే భూపతిరెడ్డి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని దినేష్ కులచారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.మల్కాపూర్ గ్రామ శివారులో చేపడుతున్న మొరం తవ్వకాలపై బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మొరం తవ్వకాలను పరిశీలించి మొరం దందా అని డాక్టర్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.   మొరం తవ్వకాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అధికారికంగా చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో దినేష్ కులచారి  టీడీపీ,  బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.   కార్యక్రమంలో ఎల్లయ్య, శ్రీనివాస్, జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article