. . ఎస్ జి టియు స్టేట్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
తెలంగాణ ప్రభుత్వం చెపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేలో కేవలం ఎస్ జిటిలనే కాకుండా అందరు ఉపాధ్యాయులను బాగస్వాములను చేసి దానిని తక్కువ సమయంలో పూర్తి చేసేల చర్యలు తీసుకోవాలని తెలంగాణ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యయ సంఘం అధ్యక్షులు మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పిఆర్సీల కేటాయింపులొ ఎస్ జీటి, స్కూల్ అసిస్టెంట్ ల మద్య వేతన వ్యత్యాసం తగ్గించి మెరుగైన వేతనాలు అందించాలని కొరారు. ఎస్ జి టియు జిల్లా కార్యవర్గ సమావేశం అదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సంధర్బంగా స్టేట్ అధ్యక్ష , కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, వేంకటేశంలు మాట్లాడుతు… ప్రతితరగతికి ఓక ఉపాధ్యాయుడు, ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని కేటాయించాలన్నారు . విద్యార్హలతో సంబంధం లేకుండా సినియార్టి ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని అన్నారు. 317 జివో బాధితులకు వెంటనే న్యాయం చేసి 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులను న్యాయం చేయాలని కోరారు.
ఎస్ జిటియూ జిల్లా అధ్యక్షులుగా యం వేంకట రమణ, ప్రధాన కార్యదర్శిగా గంగా ప్రసాద్, మహిళ అధ్యక్షురాలిగా ప్రతిభ, ప్రధాన కార్యదర్శిగా అరుణ, స్టేట్ కార్యదర్శి వై శ్రీనివాస్ రెడ్డి, నరేష్ సోమగిరి, జిల్లా కోశాధికారిగా బదావత్ మోహన్, ఉపాధ్యక్షులుగా ప్రదిప్ రాజ్, డి ఆశోక్, గౌరవ అధ్యక్షులుగా నరేంధర్, జిల్లా కార్యదర్శిగా దోండి వినోద్, రోజా , సంధ్యరాణి, రాజ్యలక్ష్మిల తో కుడిన కోత్త కార్యవర్గంను ఎన్నుకున్నారు.
