25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పాలిటెక్నిక్ కళాశాల వద్ద అఖిలపక్షం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్,  బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ న6574గర్ వద్ద గల ప్రాంతీయ చెరుకు మరియు పరిశోధన స్థానం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వద్ద అఖిలపక్షం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రుద్రూర్ మండల కేంద్రంలో అక్బర్ నగర్ లో గల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను జగిత్యాలలోని కళాశాలలో విలీనం చేయడానికి ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారన్నారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా యూనివర్సిటీ అధికారులు సంబంధిత అధికారులకు పంపించడం జరిగిందన్నారు. ఈ విద్యా సంవత్సరం 2026-27 సంబంధించిన అడ్మిషన్లు ఇక అక్బర్ నగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో జరగవని, జగిత్యాలలోని పోలాస కళాశాలలో విలీనం చేస్తున్నట్లు నిర్ణయించారు. దీనికి అఖిలపక్ష విద్యార్థి సంఘం నాయకులు పూర్తిగా వ్యతిరేకిస్తుంది. విద్యాభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేడు ఉన్న కళాశాలలను మూసివేసి , విలీనం పేరుతో విద్యార్థులకు సాంకేతిక విద్య దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్బర్ నగర్ లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కళాశాల నడపడానికి అన్ని సౌకర్యాలు ఉన్న ఇక్కడ విద్యార్థులు లేరనే నేపంతో కళాశాలను తరలించాలని చూస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు హాస్టల్ వసతి, సరిపడా తరగతి గదులు ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి వ్యవసాయ భూమి అన్ని రకాల శాస్త్రవేత్తలు అధ్యాపకులు అందుబాటులో ఉన్న కూడా ఇక్కడి నుంచి ఈ కళాశాల తలలించే క్రమంలో ఇదంతా జరుగుతున్నదని కొంత మంది అధికారులు కూడా దీనికి ప్రయత్నాలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు మోసం చేయడం అవుతుందని అన్నారు. ఇదే జరిగితే విద్యార్థులు అందరినీ ఏకం చేసి యూనివర్సిటీకి తాళం వేస్తాం అని హెచ్చరించారు. విద్యార్థుల అడ్మిషన్స్ ఏ విధంగా పెంచుకోవాలని చూడాలి తప్ప ఉన్న కళాశాల మూసివేయడం సరికాదని కళాశాలలో 20 మందికి విద్యార్థుల గాను 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఎక్కడ కూడా విద్యార్థుల సంఖ్య తగ్గలేదు అయినా కూడా ఈ కళాశాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యను బలవంతం చేయలే తప్ప కొనసాగే కళాశాలను మూసివేయడం మంచి పర్వం కాదని, నిజామాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఒకటే ఉన్నది. కావున దీని దృష్టిలో ఉంచుకొని కళాశాలలను ఈ విద్యా సంవత్సరం ఇక్కడి నుంచే కొనసాగించాలని, ఇచ్చిన ప్రొసీడింగ్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు ఆర్.గౌతం కుమార్, అక్బర్ నగర్ గ్రామ సర్పంచ్ సీతారాం రాజు, ఉప సర్పంచ్ హబీబ్ ఖాన్, జహీరాబాద్ దిశా కమిటీ సభ్యులు నడిపింటి నగేష్, పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు కార్తీక్ , మాజీ ఏఎంసీ చైర్మన్ బందుల సంజీవులు, మాజీ సర్పంచ్ రామ గౌడ్ అంబం. గ్రామ సర్పంచ్ గంగాధర్, బీఎస్పీ మండల అధ్యక్షులు గౌతమ్ కామ్లే బిజెపి నాయకులు రాజు, చిన్న సాయిలు, బిఆర్ఎస్ నాయకులు ఎండి.మతిన్, మాజీ ఉప సర్పంచ్ నీరడి శంకర్ ,రజాక్, జాకీర్ , సురేష్ ,కృపారావు, అశోక్ గౌడ్, ఫిరోజ్ ఖాన్, లక్ష్మణ్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article