27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జి.జి. కళాశాలలో డిగ్రీ సీట్లన్నీ భర్తీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (జి.జి. కళాశాల) లో డిగ్రీ ప్రవేశాలు పూర్తయ్యాయని, కళాశాలకు మంజూరైన మొత్తం 1860 సీట్లకు గాను 1860 సీట్లు 100 శాతం కేటాయించబడ్డాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.వివిధ కోర్సుల్లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తయిందని ఆయన వెల్లడించారు. బీఏ విభాగంలో తెలుగు మీడియం 60, ఉర్దూ మీడియం 60, రెగ్యులర్ 300, రిస్ట్రక్చర్డ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సులో 60 సీట్లతో కలిపి మొత్తం 480 మంది విద్యార్థులకు ప్రవేశాలు లభించాయి.ఉపాధి ఆధారిత ఏఈడీపీ కోర్సుల్లో భాగంగా బీకాం విభాగంలో బీఎఫ్‌ఎస్‌ఐ 60, సైన్స్ విభాగంలో హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ 60, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 60 సీట్లతో మొత్తం 180 మంది విద్యార్థులకు కేటాయింపులు జరిగాయి.

 

All degree seats at G.G. College filled.

 

బీకాం విభాగంలో సీఏ 180, ఫైనాన్స్ 60, టాక్సేషన్ 60, అనలిటిక్స్ 60, బీసీఏ 60, బీబీఏ 60 సీట్లతో మొత్తం 480 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. బీఎస్సీ విభాగంలో లైఫ్ సైన్స్ 300, ఫిజికల్ సైన్స్ 360, హానర్స్ 60 సీట్లతో మొత్తం 720 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.కళాశాలకు కేటాయించిన మొత్తం సీట్లకు విద్యార్థులు ఇప్పటికే ఆప్షన్లు నమోదు చేసుకొని ప్రవేశాలు పొందారని ప్రిన్సిపాల్ తెలిపారు. శనివారం ఒక్కరోజే 350 మంది విద్యార్థులు కళాశాలలో చేరినట్లు చెప్పారు.జూలై 4వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలు తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. రంగరత్నం, అడ్మిషన్ కన్వీనర్లు రమేష్ గౌడ్, రామస్వామి, దండు స్వామి, వినయ్ కుమార్, రంజిత, ఉమాకిరణ్, జయ ప్రసాద్, నహీదా బేగం, రాజేష్, రామకృష్ణ, కిరణ్ కుమార్ గౌడ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

 

All degree seats at G.G. College filled.

More articles

Latest article