బాన్సువాడ , బతుకమ్మ : నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవుపల్లి గ్రామంలో గ్రామస్తులు మద్యం నిషేధించారు. ఎవరైనా విక్రయిస్తే రూ. లక్ష జరిమానా విధిస్తామని బుధవారం తీర్మానం చేశారు. మద్యానికి బానిసై గ్రామంలోని పలు కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గ్రామంలో మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం ఇస్తే వారికి నజరానా సైతం ఇస్తామని ప్రకటించారు.
