సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటం

0 8,497

 

. . . విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలి

 

. . . పాలక పక్షాలు కార్పొరేట్ శక్తులకు విద్యా వ్యవస్థను అప్పగించే కుట్ర

 

. . . రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పు రావాలి

 

. . . సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల పల్లి శ్రీనివాసరావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటం చేస్తుందని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పు రావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తక్కల పల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని లేకపోవడం శోచనీయమని అన్నారు. గురువారం ఏఐఎస్ఎఫ్ జెండాను తక్కల పల్లి శ్రీనివాస్ రావు ఆవిష్కరించారు.

 

 

AISF's tireless struggle to resolve problems is the agenda

పూర్వ జాతీయ అద్యక్షులు, రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి శివ రామ కృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అమరవీరుల స్థూపం వద్ద భగత్ సింగ్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అఖిల భారత విద్యార్థి సమఖ్య (ఏఐఎస్ఎఫ్) రెండవ రోజు డెలిగేట్ల సమావేశానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా తక్కల పల్లి శ్రీనివాస్ రావు, విశిష్ట అతిథులుగా జాతీయ కార్యదర్శి దినేష్ రంగ రాజ్, పూర్వ ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు శివరామకృష్ణ,  రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటుకెల రామకృష్ణ, రఘురాం, గ్యార నరేష్ రెహమాన్, నాగ జ్యోతి, గ్యార క్రాంతి, లెనిన్, రాజు, ప్రవీణ్, బరిగల వెంకన్న, ఏఐటియుసి రైతు సంఘం రాష్ట్ర నాయకులు యాసూఫ్, బాలరాజు, భూమయ్య, మహిళ సంఘం రాష్ట్ర కార్యదర్శి జ్యోతి లు పాల్గొన్నారు. ఇటీవల మరణించిన వామపక్ష, అభ్యుదయ వాద జాతీయ, రాష్ట్ర, జిల్లా  అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ నివేదికను చదివి వినిపించారు. రెండవ రోజు సభను ఉద్దేశించి ముఖ్య అతిథి తక్కల పల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాలక పక్షాలు కార్పొరేట్ శక్తులకు విద్యా వ్యవస్థను అప్పగించే కుట్ర చేస్తుందన్నారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించకుండా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ఏఐఎస్ఎఫ్ పోరాటాలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు ఇచ్చినప్పటికీ పార్టీ విధానం ఏదైనా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన, విద్యార్థుల సమస్యలపై పోరాడుతుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో విద్యారంగాన్ని కాషాయికరణ జరగకుండా, విద్యా వ్యాపారం కాకుండా పోరాటాలు చేసింది ఏఐఎస్ఎఫ్ అని గుర్తు చేశారు. ఒక ప్రక్క మాతృభాషలో విద్యాబోధన కావాలని పోరాటం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం సంస్కృత భాష పై పాటలు చెప్పాలని చూస్తుందని, దీన్ని అరికట్టాల్సిన ఆవశ్యకత విద్యార్థి సంఘాలుగా మన పైన ఎంతో బాధ్యత ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ శివలింగ రాజన్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా ప్రపంచీకరణలో భాగంగా అమెరికా ప్రపంచ దేశాల సహజ వనరులను దోచుకోనె ప్రయత్నం చేస్తుందన్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా వెనిజులా క్యూబా ఐరోపా దేశాలపై యుద్ధానికి కాలు దువ్వుతుందన్నారు. యూపీఏ ఒకటి అధికారంలో అండగా కమ్యూనిస్టు పార్టీలు పట్టు బట్టి దేశ భద్రత ఆహార భద్రత చట్టం తీసుకువస్తే, నేటి మోడీ ప్రభుత్వం వి జి రాం జి చట్టం పేరుతో ఆహార భద్రత లేకుండా చేస్తుందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్యా వ్యవస్థలపై కన్నేసి, నూతన విద్యా విధానం పాలసి తీసుకువస్తూ, మను ధర్మాన్ని దేశ ప్రజలపై రుద్దేలా ప్రణాళికలు చేస్తుందన్నారు. నాణ్యమైన విద్య పేరుతో, నీట్, క్యూట్ లను ప్రవేశ పెట్టి విద్యార్థుల మనో ధైర్యాన్ని దెబ్బ తీస్తుందన్నారు. తమిళ నాడు లో నీట్ పరీక్షల లో ర్యాంకులు రాక ఎంతో మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేసారు. అనంతరం సౌహార్థ సందేశాన్ని ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జీ, ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, ఏం డి ఎం  రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి, సిపిఐ నాయకులు రాజేశ్వర్, రాజు రెడ్డి, రాజన్న, స్వరూప రాణి, గంగా మణి,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, కార్తీక్, కోశాధికారి అనూష, నాయకులు హాసిని, కిషోర్, నిఖిల్, గౌతం, దిలీప్, ప్రవీణ్, సోను రాజ్, ఆకాష్, కృతిక్  పాల్గొన్నారు.

 

 

AISF's tireless struggle to resolve problems is the agenda

Leave A Reply

Your email address will not be published.