29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్రంలోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ లో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ పేరుతో గురువారం “ఆవిష్కార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనల నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, ఆరోగ్యకరమైన ఆహారం, సన్ డయల్, అంతరిక్ష పరిశోధన నమూనాలు తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. ఒక్కో ఎగ్జిబిట్ ను సందర్శిస్తూ, వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

 

Science fairs help foster creativity

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేవలం తరగతి గది, పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులు సైన్స్ ఫేర్ లో పాల్గొని తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమని, ఈ దిశగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని కొత్తకొత్త ప్రయోగాలు చేసేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సంతోష్, శ్రీదేవి, ప్రిన్సిపాల్ ఆంథోని, లత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

Science fairs help foster creativity

More articles

Latest article