జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసిన వ్యవసాయ కార్మిక రైతు సంఘం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని సిఐటియు అనుబంధ వ్యవసాయ కార్మిక రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శనివారం ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు పెద్ది వెంకట్ రాములు,వెంకటేష్, శంకర్ గౌడ్, రమేష్ బాబు లు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా పనిచేస్తూ ప్రజల హక్కుగా ఉన్న ఓటు హక్కులు 13 కోట్ల ఓట్ల రద్దు...