పేకాటలో పట్టుబడ్డ వారిపై చర్యలేవి.. ?

0 2,708
  •  పోలీసుల దాడిలో పట్టుబడ్డ ముగ్గురు ఉద్యోగులు
  •  దర్జాగా విధులకు హాజరవుతున్న వైనం

బతుకమ్మ, నిజామాబాద్ క్రైo : నిజామాబాద్ నగరంలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ ముగ్గురు ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈనెల 11న నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పేకాట స్థానంపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగో టౌన్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 11 మంది పట్టుబడుగా రూ.10 వెల పైచిలుకు నగదు పట్టుబడింది. అందులో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బండి నారాయణ, ఆలూరు తాసిల్దార్ కార్యాలయంలో పనిచేసే రెవిన్యూ ఇన్స్పెక్టర్ రఫిక్, కానిస్టేబుల్ మూర్తి ఉన్నారు. వారిపై నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో గేమింగ్ యాక్ట్ కేసు నమోదు అయింది . తర్వాత వారు వ్యక్తిగత పుచికత్తుపై విడుదలయ్యారు . వారు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందగదంలో ఆలస్యమైంది. వారు మాత్రం ముగ్గురు దర్జాగా గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొనడం విశేషం. ఇటీవల ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంబంధిత శాఖలో ముగ్గురు ఉద్యోగుల పేకాట వ్యవహారం చర్చనీయంగా మారింది. ఈ విషయంపై నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ను వివరణ కోరగా పేకాట ఆడుతూ పట్టుబడిన ముగ్గురు ఉద్యోగుల గురించి సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.