29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మెల్యే పిఏగా పనిచేస్తున్న ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మైలారం గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రూరల్ ఎమ్మెల్యే పిఏ గా పనిచేస్తున్నారని వారి పైన జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి  జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో కోటగల్లి నీలం రామచంద్ర భవన్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు పీఏలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పని చేయొద్దని  విద్య హక్కు చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించి పిఏగా పనిచేస్తున్నాడని, పిఏగా పనిచేయడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, పేద విద్యార్థులు పాఠాలు చెప్పాల్సింది పోయి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ పీఏ గా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. గతంలోనే సంబంధిత ఎంఈఓ కు, డీఈవో కు విషయాన్ని చేరవేశామని ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో  నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్తూనే ఉపాధ్యాయులను పీఏ గా పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. విధులు నిర్వహించకుండా లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్న శ్రీనివాసరెడ్డి పై చర్యలు చేపట్టాలని లేనిచో ఆందోళన కార్యక్రమలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు నిఖిల్, మనోజ్, నగర అధ్యక్ష కార్యదర్శులు సిర్రం పవన్ కుమార్, డి.సాయి కిరణ్, నాయకులు రాజేష్, శంకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article