ఎమ్మెల్యే పిఏగా పనిచేస్తున్న ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మైలారం గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రూరల్ ఎమ్మెల్యే పిఏ గా పనిచేస్తున్నారని వారి పైన జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో కోటగల్లి నీలం రామచంద్ర భవన్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు...