25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నాలెడ్జ్ పార్క్ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మోసపూరిత ప్రకటనలతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులు మోసం చేస్తున్న నాలెడ్జ్ పార్క్ జూనియర్ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా అన్నారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలెడ్జ్ పార్క్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం వారికి ఆకాష్ బైజూస్ కోచింగ్ సెంటర్ తో సంబంధాలు ఉన్నట్టు రోడ్డుకి ఇరు వైపులా విచ్చల విడిగా ఫ్లెక్సీలను అంటిస్తున్నారన్నారు. కానీ ఆకాష్ బైజూస్ వారిని ఆరా తీయగా వారికి ఎటువంటి సంబందం లేదని తెలిపారు. ఈ విధంగా విద్యార్థులని, వారి తల్లిదండ్రులని మోసం చేస్తున్న యాజమాన్యం పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన డీఈఓ తక్షణమే ఫ్లెక్సీలు తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

More articles

Latest article