. . . సమ్మర్ క్యాంపు పేరిట ఫీజుల దందా నిర్వహిస్తున్న కార్పొరేట్ యజమాన్యాలు
. . . తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా విద్యాశాఖ అధికారి జ్వాల
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సమ్మర్ క్యాంప్ పేరిట ఫీజు ల వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల అన్నారు. ఈ విషయమై టీఎస్ఏ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్వాలా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ విపరీతమైనటువంటి ఫ్లెక్సిలు ఏర్పాటు చేస్తూ, ఇంటింటా కరపత్రాలు పంచుతూ సమ్మర్ క్యాంప్ అంటూ ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. వేసవి లో ఎండలని దృష్టి లో పెట్టుకుని ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించినా, కార్పొరేట్ పాఠశాలలు మాత్రం ఎండలను లెక్క చేయకుండా సమ్మర్ క్యాంప్ లను నిర్వహిస్తున్నాయన్నారు. అందుకే తక్షణమే ప్రచారాలు ఆపాలని, సమ్మర్ క్యాంప్ లను కూడా నిర్వహించకుండా ఉండాలని విద్యాసంస్థలకు డిఈఓ నోటీసులు జారీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
