26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డు కబ్జా చేసిన వారి పై చర్యలు తీసుకోవాలి..

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని మల్లయ్య గుట్టకు వెళ్లే దారిలో నక్కల ఓర్రె పోయే రోడ్డు, సాసర గుంట కట్ట నెం: 301 ఈ రెండు రోడ్లను ఏంబరి యమన్ అను వ్యక్తి 50 సంవత్సరాల నుండి ఉన్న రోడ్డును కబ్జా చేయడమే కాకుండా నక్కల ఓర్రే రోడ్డు సుమారు 20 ఫీట్లు కూడా జేసీబీ , ట్రాక్టర్ సహాయంతో తోడేస్తున్నారు. రోడ్డు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రోజున రైతులు తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రోడ్డు కబ్జా గురించి ఎవరైనా రైతులు అడిగితే వాళ్ళ పై దౌర్జన్యం చేయడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ భూములును సర్వే చేసి ఈ వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వినతి పత్రం అందించిన వారిలో రైతులు భోజగొండ అనీల్, కొత్తపల్లి రవికిరణ్, సూరజ్ శ్రీనివాస్, బుద్దె శివకుమార్, బైండ్ల అనీల్, బుద్దె రమేష్ తదితరులు ఉన్నారు.

 

Action must be taken against those who have encroached upon the road.

More articles

Latest article