కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు

0 4,157

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్,బతుకమ్మ :  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఉండవని ఎన్డీఎస్ఏ చెప్పిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీకి.. కాళేశ్వరానికి పోలికేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్‌ చేయాలని కేటీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కట్టిన మూడేళ్లకే ప్రాజెక్టు కూలడం నిజంగానే ప్రపంచంలో 8వ వింత అని మంత్రి వ్యాఖ్యనించారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టి మోసం చేశారని , తుమ్మిడిహట్టి పూర్తయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందని పక్కన పెట్టారని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.