27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఆరు హత్యల కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

. నిందితులు తల్లీ కొడుకులు

నిజమాబాద్, బతుకమ్మ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల మంగళవారం తీర్పు వెలువరించారు. ఏడాదిన్నర క్రితం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో తన్న స్నేహితుడు ప్రసాద్ తోపాటు వారి కుటుంబానికి చెందిన ఐదుగరిని ప్రశాంత్ అనే యువకుడు వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేశాడు. ప్రశాంత్ కు ప్రసాద్ తో బంధుత్వంతోపాటు స్నేహం కూడా ఉండడంతో  వారితో సన్నిహితంగా ఉంటూ ఆస్తిని కాజేసేందుకు కుట్ర చేశాడు. ఈ క్రమంలో ఒక్కొక్కరిని హత్య చేస్తూ వచ్చాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడు ప్రశాంత్ సదాశివనగర్ మండలం భూంపల్లి లో ఒక హత్య వెలుగు చూడగా పోలీసులు దర్యాప్తు చేపట్టి మాక్లూర్ మండలవాసిగా గుర్తించారు. ఆ తరువాత వేర్వేరు ప్రాంతాల్లో  ప్రసాద్ కుటుంబ సభ్యుల మృతదేహాలు లభించాయి. చివరగా సోన్ బ్రిడ్జి కింద ఓ శవాన్ని గుర్తించిన పోలీసులు ప్రశాంత్ హత్యలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆరుగురి హత్య కేసులో ప్రశాంత్ తోపాటు అతడికి సహకరించిన తల్లికి సైతం న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. 

 

More articles

Latest article