29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

దొంగతనం కేసులో నిందితునికి 9నెలల జైలు

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : ఇంట్లో దొంగతనం చేసిన నిందితునికి కోర్టు 9నెలల జైలు శిక్ష, రూ.200జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లక్ష్మాచంద గ్రామానికి చెందిన బీర్కుల సుధీర్ కుమార్ భిక్నూర్ మండలంలో 2023నుంచి సీఎస్ఐ చర్చి ఫాదర్ గా పని చేస్తున్నాడు. గతనెల 10న ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వంత గ్రామానికి వెళ్లాడు. తిరిగి 11న వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి, బీరువా తెరచి అందులో ఉన్న మూడు తులాల బంగారం, 15తులాల వెండిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు గుర్తించారు. అదే రోజు భిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిశోధనలో భాగంగా కాలనీ వాసులను విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అనంతరం చుట్టు పక్కల ప్రాంతాల సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. లభించిన ఆధారాల ప్రకారం, సాంకేతిక ఆధాలతో పాత నేరస్తుడైన భైరవగారి హరీష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో నిందితున్ని కోర్టులో హాజరు పరిచారు. ఆధారాలను పరిశీలించిన కామారెడ్డి స్పెషల్ మొబైల్ కోర్ట్ మెజిస్ట్రేట్ నిందితునికి 9నెలల జైలు శిక్ష, రూ.200జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును సరైన పద్ధతిలో విచారణ చేసిన అప్పటి భిక్కనూర్ ఎస్ హెచ్ ఓ సాయికుమార్, ప్రస్తుత ఎస్ హెచ్ ఓ ఆంజనేయులు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ రామేశ్వర్ రెడ్డి, సీడీఓ రాజశేఖర్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

More articles

Latest article