- ఏ1గా మాలవత్ సంగీత, ఏ2గా మాలవత్ కవితలపై కేసు నమోదు
- ఇరువురుకి జ్యూడిషియల్ రిమాండ్
భీమ్ గల్, బతుకమ్మ : రోజు భాదిస్తున్నాడని కట్టుకొన్న భర్తను అతికిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన భార్యలిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సి.ఐ మీడియా తో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవక్క పేట్ గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ అలియాస్ బ్యాండ్ మోహన్ (32) కు ఇద్దరు భార్యలు. బ్యాండ్ కొట్టి జీవనం కొనసాగించే వారని, ఆయన తాగి రోజు వేధింపులకు గురి చేసే వాడని, ఆ వేధింపులు భరించలేక్ పథకం ప్రకారం కుర్చీలో కూర్చున్న మోహన్ పై పెట్రోల్ పోసి చంపినట్లు నిందితులు, మృతుని భార్యలు కవిత, సంగీతలు ఒప్పుకొన్నారని తెలిపారు. నిందితులిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మృత్తునిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చిన్న భార్య సంగీత ను ఏ. 1 గా, అందుకు సహకరించిన పెద్ద భార్య కవిత ను ఏ. 2 గా గుర్తించి నిందితులపై సెక్షన్ 103(1) ఆర్/డబ్ల్యూ 3(5)బిఎన్ ఎస్ కేసు నమోదు చేసినట్లు సీ. ఐ తెలిపారు. నిందితులనిద్దరి జ్యూడిసియల్ కస్టడికి పంపినట్లు సీ ఐ తెలిపారు.