29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బిచ్కుందలో ఏసీబీ కలకలం

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  ఎక్సైజ్ సిఐ నివాసంలో తనిఖీలు

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లాలో ఏసీబీ తనిఖీలు కలకలం రేపాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో బస్టాండ్ ప్రాంతంలో అవినీతి నిరోదక శాఖాధికారులు ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. సంబంధిత నివాసంలో బిచ్కుంద ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ అద్దెకు ఉంటున్నారు. ఆయన నివాసంలోనే ఏసీబీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం సిఐ నివాసంలో తనిఖీలు నిర్వహించగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్పటికప్పుడు వైద్యులను రప్పించి సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య తనిఖీలు జరుగుతున్నాయి.

ACB stir in Bichkunda
ACB stir in Bichkunda

More articles

Latest article