. . . ఏసిబికి భయపడోద్ధు నేను చూసుకుంటా
. . . విధి నిర్వహణలో నాకు సహకరిస్తే చాలు
. . . జిల్లా దాటినోళ్లను తిరిగి యధాస్థానంలోకి రప్పిస్తా
. . . ఎక్సైజ్ సిబ్బందికి అబ్కారి అధికారి భరోసా
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ పేరు ఇప్పుడు రాష్ట్రంలో మారు మ్రోగుతుంది. ఎందుకంటే గత నెలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటేండేంట్ కోమ్మూరి మల్లారెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అస్తుల విలువను లెక్కగట్టాడానికి ఏసిబి అధికారులు ఇప్పటికి అపసోపాలు పడుతున్నారు. ఆనాడు ఏసిబి సొధాలలో రూ.3 కోట్ల ఆస్తులను గుర్తించగా బహిరంగ మార్కేట్ లో ఎన్నోరేట్లు ఎక్కువగా తేల్చారు. తాజాగా ఈ నెల 1న రెండు బ్యాంక్ లాకర్లను తెరిచిన ఏసిబికి కండ్లు బైర్లు కమ్మాయి. ఒక లాకర్ లో 1.25 కేజిల బంగారం, మరో లాకర్ లో కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నారు. రెండు లాకర్లలో ఉన్న సొత్తు విలువ ప్రస్తుత మార్కేట్ ప్రకారం రూ.1.82 కోట్లుగా గుర్తించారు. ఇంకా బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తులను చూసి మల్లారెడ్డి ఆస్తుల విలువలో వంద కోట్ల క్లబ్ దాటుతాడని ఏసిబి అధికారులు అంచనావేశారు. మల్లారెడ్డి అరెస్టు నేపథ్యం కావచ్చు అప్పటికే ఖాళీగా ఉన్న ఉమ్మడి జిల్లాకు బాస్ గా ఉండే డిప్యూటి కమీషనర్, అసిస్టెంట్ కమీషనర్ పోస్టులతో పాటు, నిజామాబాద్ ఈఎస్ పోస్టును భర్తి చేశారు. వారు ఉన్నపళంగా వచ్చి విధులలో చేరారు.

గత నెల 29న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒ స్టార్ హోటల్ లో ఒక అబ్కారి శాఖాధికారి ఆధ్వర్యంలో రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశం సాధారణంగా ప్రభుత్వ శాఖలో బదిలీ జరిగితే వీడ్కోలు.. కొత్తవారు వస్తే స్వాగత సమావేశంలా జరుగాల్సింది. కానీ ఎక్సైజ్ జిల్లా బాస్ ఏసిబికి ఆదాయానికి మించిన ఆస్తులతో పట్టుబడటంతో గుట్టు చప్పుడు కాకుండా జరిగింది. ఈ సమావేశానికి ఆ బాస్ కింది అధికారులు, సిబ్బంది (కానిస్టెబుళ్లు, హెడ్ కానిస్టెబుళ్లు) లతో గేట్ టూ గేధర్ గా జరిగింది. అధికారులు, సిబ్బంది తనకు సహకరించాలని సమావేశం (పరిచయం) కార్యక్రమం నిర్వహించినట్లు తెలిసింది. ఎటోచ్చిన మనందరం కలిసి మెలిసి పని చేసుకుందామని గతంలో పనిచేసిన అధికారులకు మాదిరిగా సహకరించుకుందామని, ఏసిబి లాంటి దాడులతో భయపడవద్ధని అంతా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. గత కొంత కాలం క్రితం బదిలీలలో జోన్ పరిధిలోని ఇతర ప్రాంతాలకు బదిలీ ఐనవారిని తిరిగి యదాస్థానాలకు వచ్చేందుకు తనవంతు సహయ సహకారాలు అందిస్తానని హమి ఇచ్చినట్లు సమాచారం. తమలో తామే కలహించుకోని మిడియా ద్వార రచ్చకేక్కోద్ధని హితువు పలికినట్లు తెలిసింది. స్టార్ హోటల్ లో సమావేశం సిండికేట్ ద్వార జరపినట్లు విశ్వసనీయంగా తెలిసింది…
నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో జంట నగరాల తరువాత అధికంగా ఆదాయం వచ్చే శాఖగా పెరుంది. డిస్టలరీలతో పాటు మద్యం దుకాణాలు అధికంగా ఉన్న రాజదాని చూట్టు పక్కల ప్రాంతాలకంటే పీస్ గా పుల్ ఆదాయం వచ్చే జిల్లాగా నిజామాబాద్ అబ్కారి శాఖకు పేరు గడించింది. ఇక్కడ పనిచేసే అధికారులకు కాసుల పంటే. అధికారులుగా ఇక్కడ పనిచేస్తు ఎక్కడ ఉంటు పనులు చక్కబెట్టుకున్న కమీషనర్ వరకు విషయం తెలిసిన పట్టించుకోరు అని పేరు. ఇక్కడ కేవలం కల్లు మాఫీయా ద్వార వచ్చె నెలవారి మాముళ్లు లక్షల్లో ఉండటంతో ఇక్కడ పోస్టింగ్ కమీషనర్ స్థాయి నుంచి మంత్రుల సిఫారసు తప్పనిసరి. అందుకే చాలమంది అధికారులు నిజామాబాద్ జిల్లాలో పోస్టింగ్ అంటే బంగారు గుడ్లు పెట్టే బాతులాగానే బావిస్తారు. కల్లు మాఫీయాకు తోడు సిండికేట్ ( మద్యం వ్యాపారుల గుంపు) ద్వార బెల్ట్ వ్యాఫారం జరిగినన్ని రోజులు అబ్కారి శాఖలో కానిస్టెబుల్ మొదలుకోని అధికారులకు జీతం అక్కర్లేకుండా మాముళ్లు కలకలాడుతాయని పేరుంది. అందుకే నిజామాబాద్ ఎక్సైజ్ ఈఎస్ ఏసిబి ఆక్రమ ఆస్తుల కేసులో అరెస్టై జైలు ఉచలు లెక్కపెడుతున్న, నిజామాబాద్ ఎక్సైజ్ అధికారుల నెలవారి మాముళ్ల చిట్టా సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న ఎలాంటి జంకు , భయం లేకుండానే విధుల నిర్వహణ, సంపాధన కోసం జరిగిన అబ్కారి అధికారుల సమావేశం చర్చనీయాంశంగా మారింది.

