29 C
Hyderabad
Monday, August 3, 2026

ఏసీబీకి చిక్కిన పెద్దవంగర ఎమ్మార్వో

Must read

📰 Generate e-Paper Clip

పెద్దవంగర, బతుకమ్మ : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎమ్మార్వో మహేంధర్, డ్రైవర్ గౌతం లను ఓ రైతు నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు భూమి మ్యూటేషన్ చేసేందుకు రూ.20వేలు ఎమ్మార్వో మహేందర్ డిమాండ్ చేశారు. అంత డబ్బు తాను ఇవ్వలేనని రైతు వేడుకున్నా వినలేదు. ఆరునెలలుగా తిరిగి రూ.15వేలు ఇచ్చేందుకు రైతు ఒప్పుకున్నాడు. అనంతరం వరంగల్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు సూచించిన విధంగా ఎమ్మార్వోను కలిశాడు. డబ్బు తన డ్రైవర్ గౌతంకు ఇవ్వాలని ఎమ్మార్వో రైతుకు సూచించాడు. దీంతో డ్రైవర్ కు రైతు డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వో, డ్రైవర్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

More articles

Latest article