26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల తొలి విడత నామినేషన్ల సందర్భంగా భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ  విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగాలని సూచించారు. ఎలాంటి అంతరాయం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 25 ఫ్లయింగ్ స్క్వాడ్ బ్రుందాలు, 5 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, రెండు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు, మూడు అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను కఠినంగా పర్యవేక్షిస్తూ, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

More articles

Latest article