నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలో బైక్ పార్కింగ్ విషయంలో యువకుల మధ్య జరిగిన గొడవలో ఒకరు చనిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. నగరంలోని గోశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్టకు చెందిన చంద్రకాంత్ గైక్వాడ్ అనే యువకుడు బైక్ పార్క్ చేస్తుండగా అక్కడ ఉన్న మరో కొందరి యువకులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో వారు దాడిచేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో యువకులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దగ్గరలోని సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు. డెడ్ బాడీని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
