25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రత్యేక టింను అడ్డుకున్న యువకుడు

Must read

📰 Generate e-Paper Clip

. . . కోటగిరి పిఎస్ లో పిర్యాదు చేసిన సిబ్బంది

 కోటగిరి, బతుకమ్మ:

పోతంగల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పోలీసు, రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బృందము  పెట్రోలింగ్ చేస్తుండగా కోందరు అడ్డుకున్నారు. ఈ సంఘటన పోతంగల్ గ్రామములో  చెక్ పోస్ట్ వద్ద (తిరుమలాపూర్  క్రాసింగ్) వద్ద  బుదవారం రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఒక టిప్పర్ ను సిబ్బంది ఆపినారు.  టిప్పర్ ను  కోటగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళుచుండగా, పోతంగల్ గ్రామానికి చెందిన బజరంగ్ దత్తు అనే వ్యక్తి  సిబ్బందిని దౌర్జన్యంగా పక్కకు తోసివేసి కారులో ఎక్కకుండా చేసి దాదాపు 15 నిమిషాలు  సిబ్బందిని అడ్డగించి, అక్రమ ఇసుక టిప్పర్ ను అక్కడినుండి పంపించి వేసినాడు. అదే ప్రదేశంలో అక్రమ ఇసుక టిప్పర్ల లోడ్ చేసిన నెంబర్ లేనటువంటి జేసిబి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్  తరలించారు. సిబ్బంది కారు వెళ్లకుండా  అడ్డగించి, ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి, సిబ్బంది పై దౌర్జన్యం చేసి భజరంగ్ దత్తు అనే వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టిం సభ్యులు కోటగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

More articles

Latest article