27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జూమ్ స్విమ్మింగ్ ఫూల్ లో నీట మునిగి యువకుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

ఈత నేర్చుకునేందుకు వెళ్లిన యువకుడిని స్విమ్మింగ్ ఫూల్ పొట్టన పెట్టుకుంది. అనుమతి లేని స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ కోచ్ లేకుండా నిర్వహకుల ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఈతకు దిగిన యువకుడు నీట మునిగి మృతి చెందాడు.

A young man drowned in Zoom swimming pool and died

ఈ సంఘటన బుధవారం నగరంలో బోధన్ రోడ్డులోని సారంగపూర్ ( పాత సిఆర్ పిఎప్ క్యాంప్) సమీపం గల జూమ్ స్విమ్మింగ్ ఫూల్ లో జరిగింది. నిజాం కాలనీకి చెందిన సయ్యద్ అష్రఫ్ (22) , అతని అన్నతో కలిసి జూమ్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేందుకు వేళ్లారు. అక్కడ స్విమ్మింగ్ కోచ్ లేకపోయిన, ఆశ్రప్ ( గాలి బుడగ) ట్యూబ్ ధరించకున్న అతడిని ఈత కొట్టేందుకు అనుమతించారు. యువకుడు లోతుకు వెళ్ళి మునిగిపోతుండగా అక్కడ ఉన్నవారు ఎవ్వరికి ఈత రాకపోవడంతో అతడిని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు.

 

A young man drowned in Zoom swimming pool and died ఆశ్రప్ సోదరుడు అక్కడే ఉండి తన కళ్ల ఎదుటే అతడు మునిగిపోతుండగా కాపాడలేకపోయారు. భాధితులు ఆరవ  టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మజ్లిస్ పార్టీ నాయకులు జిల్లా ఆసుపత్రిలో మార్చురికి  చెరుకుని బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే నిర్వాహకులు మాత్రం పరారీలో ఉండే కేసు రాజీ కోసం ప్రయత్నాలు చేయడం గమనార్హం. రెండు నెలల క్రితం అనుమతులు లేకుండానే స్విమ్మింగ్ ఫూల్ ను ప్రారంభించిన నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దానిని సీజ్ చేయాలని డిమాండ్  చేస్తున్నారు స్థానికులు.

A young man drowned in Zoom swimming pool and died

More articles

Latest article