జూమ్ స్విమ్మింగ్ ఫూల్ లో నీట మునిగి యువకుడు మృతి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన యువకుడిని స్విమ్మింగ్ ఫూల్ పొట్టన పెట్టుకుంది. అనుమతి లేని స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ కోచ్ లేకుండా నిర్వహకుల ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఈతకు దిగిన యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం నగరంలో బోధన్ రోడ్డులోని సారంగపూర్ ( పాత సిఆర్ పిఎప్ క్యాంప్) సమీపం గల జూమ్ స్విమ్మింగ్ ఫూల్ లో జరిగింది. నిజాం కాలనీకి చెందిన సయ్యద్ అష్రఫ్ (22) , అతని అన్నతో...