24.2 C
Hyderabad

నకిలీ యాపిల్‌ ఉత్పత్తుల స్కాం బట్టబయలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ దాడులు

ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌, బతుకమ్మ : హైదరాబాద్ లో నకిలీ యాపిల్‌ ఉత్పత్తుల స్కాం బయటపడింది.  మీర్‌చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి… రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్‌ యాపిల్‌ యాక్సెసరీస్‌ స్వాధీనం చేసుకున్నారు. షాహిద్‌ అలీ, ఇర్ఫాన్‌ అలీ, సంతోష్‌ రాజ్‌ పురోహిత్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్‌ యాపిల్‌ గాడ్జెట్స్‌ కొనుగోలు చేస్తన్నట్లు గుర్తించారు. యాపిల్‌ లోగో, స్టిక్కర్లు, సీల్‌లతో నకిలీ ప్యాకేజింగ్‌ చేసి అసలైనవిగా నమ్మంచి కస్టమర్లను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. యాపిల్ వాచ్ లు, ఎయిర్ ప్యాడ్స్, పవర్ బ్యాంకులు, కేబుల్స్ మొత్తంగా 2761 నకిలీ ఉత్పత్తులను సీజ్ చేశారు.

More articles

Latest article