25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మత్తుకి బానిసై చెరువులో పడి యువకుని దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గ్రామంలో మత్తు పదార్థాలను అరికట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (21) అనే యువకుడు మత్తు పదార్థాలకు బానిసై చెరువులో పడి దుర్మరణం చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మూడు రోజుల నుండి మృతుడు శ్రీకాంత్ అదృశ్యమై శుక్రవారం రోజున రాయకూర్ గ్రామ చెరువు వద్ద మృతదేహం లభించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు శ్రీకాంత్ తల్లి శోభ అంగన్వాడీ సెంటర్ లో ఆయాగా విధులు నిర్వహిస్తుండేదని, నెల తిరగకముందే శ్రీకాంత్ తల్లి మరణించడం బాధాకరమన్నారు. మృతుడు శ్రీకాంత్ మద్యం, మత్తు పదార్థాలకు బానిసై చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. గ్రామంలో యువత మత్తు పదార్థాలకు బానిసై మృతి చెందిన సంఘటనలు లేకపోలేవన్నారు. మత్తు పదార్థాలను అరికట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పేర్కొన్నారు. అనంతరం ఎస్సై సాయన్న తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టు మార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించి,  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న వెల్లడించారు.

 

 

A young man died after falling into a pond while addicted to drugs.

More articles

Latest article