ప్రైవేట్ బస్సు ఢీకొని మహిళ మృతి
బతుకమ్మ భిక్కనూరు : రోడ్డు దాటుతున్న మహిళను అతివేగంతో వచ్చిన ప్రైవేటు బస్సు ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వరనగర్ గ్రామం వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన గుడ్డెంగారి సిద్ధవ్వ(48) సిద్ధ రామేశ్వర నగర్ గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అటువైపుగా వెళ్తున్న...