24.1 C
Hyderabad
Monday, August 3, 2026

తేయూ ఎడ్యుకేషన్ కళాశాల అకాడమిక్  కోఆర్డినేటర్ గా ఏ.సువర్చల 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ  ఎడ్యుకేషన్ కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ గా  ఏ. సువర్చలను  నియమిస్తూ  వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు  నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని సారంగాపూర్ ఎడ్యుకేషన్ కళాశాలలో  అసిస్టెంట్ ప్రొఫెసర్ ( సి) గా విధులు నిర్వహిస్తున్న ఏ.సువర్చల ఆధునిక బోధనా పద్ధతులు  బోధించడంలో ప్రావీణ్యం పొంది ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా ఏ.సువర్చల  మాట్లాడుతూ తన మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన  వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ యాదగిరిరావుకు, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ యాదగిరి కి, ప్రిన్సిపాల్  డాక్టర్ బి సాయులు కు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article