నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ గా ఏ. సువర్చలను నియమిస్తూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని సారంగాపూర్ ఎడ్యుకేషన్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ( సి) గా విధులు నిర్వహిస్తున్న ఏ.సువర్చల ఆధునిక బోధనా పద్ధతులు బోధించడంలో ప్రావీణ్యం పొంది ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా ఏ.సువర్చల మాట్లాడుతూ తన మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావుకు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి కి, ప్రిన్సిపాల్ డాక్టర్ బి సాయులు కు కృతజ్ఞతలు తెలిపారు.