బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని దొన్ పాల్ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంను ఎంపీడీవో తిరుమల దేవి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ పిల్లలకు ప్రతిరోజు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. గర్భిణులకు బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు పిల్లల యొక్క ప్రీస్కూల్ రిజిస్టర్ ను, వంట ను పరిశీలించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మక్కల సుజాత, హెల్పర్ లత, గర్భిణీలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన ఎంపీడీవో మండలంలోని దోన్ పాల్ గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఎంపీడీవో తిరుమలా దేవి బుధవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సిబ్బంది చేసిన సర్వేలు పొందుపరిచిన వివరాలను ఆమె మరోసారి లబ్దారుల ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. సర్వేలు లబ్ధిదారుల గుర్తింపులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు.

