ఆకస్మికంగా అంగన్వాడీ కేంద్రం తనిఖీ

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని దొన్ పాల్ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంను ఎంపీడీవో తిరుమల దేవి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ పిల్లలకు ప్రతిరోజు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. గర్భిణులకు బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు పిల్లల యొక్క ప్రీస్కూల్ రిజిస్టర్ ను, వంట ను పరిశీలించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మక్కల సుజాత, హెల్పర్ లత, గర్భిణీలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ...