29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏసీపి శ్రీనివాస్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని బోధన్ ఏసీపి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంపు గ్రామంలో 10 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దొంగలను అరికట్టడంలో, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు దోహదపడతాయని వివరించారు. గ్రామాల్లోని ప్రధాన కూడలిల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

A single CCTV camera is equal to 100 police personnel.

More articles

Latest article