ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం
. . . ఏసీపి శ్రీనివాస్ రుద్రూర్, బతుకమ్మ : ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని బోధన్ ఏసీపి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంపు గ్రామంలో 10 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దొంగలను అరికట్టడంలో, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు దోహదపడతాయని వివరించారు. గ్రామాల్లోని ప్రధాన కూడలిల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సీఐ...