నిజామాబాద్ రూరల్, బతుకమ్మ
నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యెన్నం బాగారెడ్డిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. భూపతి రెడ్డి బుధవారం పరామర్శించారు. బాగారెడ్డి తల్లి యెన్నం బాలవ్వ అనారోగ్యంతో మంగళవారం మరణించగా ఎమ్మెల్యే బాగారెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ శేఖర్ గౌడ్,అగ్గు భోజన్న, యెన్నం వెంకట్ రెడ్డి, ఫస్ట్ డివిజన్ కార్పొరేటర్ కోర్వ లలితా గంగాధర్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంచందర్, ఏఎంసీ డైరెక్టర్లు రాజలింగం, నరేందర్,భాగీర్తి బాగారెడ్డి,మాజీ గంగాధర్,కోటయ్య, లింబారెడ్డి, జిన్నా లచ్చరెడ్డి,ధర్మారెడ్డి,యెన్నం లచ్చరెడ్డి సాయరెడ్డి, గంగారెడ్డి, సిరికొండ సొసైటీ చైర్మన్ చెల్లం గంగాధర్, రమేష్, సంజీవ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
