ఎల్లారెడ్డి, బతుకమ్మ: రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 46 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం స్థానిక రాజకీయాల్లో అరుదైన ఘట్టంగా నిలిచింది. ఇక అభ్యర్థులపై ప్రజల్లో నెలకొన్న నమ్మకం, గ్రామస్తుల ఐక్యత, శాంతియుత వాతావరణం కూడా ఏకగ్రీవాలకు దోహదపడ్డాయి. ప్రతిపక్షం పోటీకి దూరంగా ఉండటంతో, అనేక గ్రామాల్లో ఎన్నికలు జరగకుండానే స్థానిక అభ్యర్థులు పదవిలోకి చేరినట్లైంది. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది.
మండలాల వారీగా వివరాలు :
నాగిరెడ్డిపేట్ : 6 పంచాయతీలు
లింగంపేట : 14 పంచాయతీలు
ఎల్లారెడ్డి : 5 పంచాయతీలు
గాంధారి : 16 పంచాయతీలు
సదశివనగర్ : 3 పంచాయతీలు
రాజంపేట : 2 పంచాయతీలు
