. పొక్లెయిన్ లు, ట్రాలీల ద్వారా తొలగింపు
అయోధ్య, బతుకమ్మ: అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ప్రతి రోజూ లక్షలాది మంది తరలివస్తుండడంతో ఆలయ సమీపంలో గుట్టలుగా చెప్పులు, బూట్లు పేరుకుపోతున్నాయి. ప్రయాగ్ రాజ్ కుంభ మేళాకు వెళ్లిన భక్తులు అయోధ్యకు పోటెత్తుతుండడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశం, బయటికి వెళ్లే మార్గాలను ట్రస్టు మార్చింది. మొదటి గేటు నుంచి లోపలికి వెళ్తున్న భక్తులు అక్కడే తమ పాదరక్షలను వదులుతున్నారు. మూడో నంబర్ గేటు నుంచి బయటికి వస్తున్న భక్తులు మళ్లీ మొదటి గేటు వద్దకు వెళ్లాలంటే సుమారు ఆరు కిలోమీటర్లు నడవాల్సి రావడంతో భక్తులు పాదరక్షల కోసం వెళ్లడం లేదు. దీంతో గుట్టలుగా చెప్పులు, బూట్లు పేరుకుపోతున్నాయి. అయోధ్య మున్సిపాలిటీ వారు పొక్లెయిన్ లు, ట్రాలీలు ఏర్పాటు చేసి వాటిని తొలగిస్తున్నారు.