. . . నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వ్యక్తిగత ఏజెండాలు పెట్టుకొని ఎవరు పని చేయకూడదని, పార్టీ ఇచ్చే ఆదేశాలను, నియమాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధికి దోహద పడాలని నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఎన్.ఎస్.యు.ఐ ఫౌండేషన్ డే సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ జెండా ఎగరవేసి, జిల్లా ఎన్.ఎస్.యు.ఐ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ స్టూడెంట్స్ యూనియన్, పశ్చిమ్ బెంగాల్ స్టేట్ ఛాత్ర పరిషత్ లను 1971 ఏప్రిల్ 9న ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలుగా విలీనం చేసి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా గా ఆవిర్భవించడం జరిగిందని తెలిపారు. జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ తన రాజకీయ అనుభవాన్ని ఎన్.ఎస్.యు.ఐ విభాగంలో మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎదగడం జరిగిందని, అదే విధంగా జిల్లాలో డి.శ్రీనివాస్ కూడా ఎన్.ఎస్.యు.ఐ నాయకుడి నుండి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వరకు తన ప్రస్థానం కొనసాగించడం జరిగిందని వివరించారు. త్వరలోనే జిల్లా ఎన్.ఎస్.యు.ఐ కమిటీని అధిష్ఠానం ఆదేశాలతో ఎన్నికల ద్వారా గాని, ఇంటర్వ్యూ ద్వారా గానీ నియమించడం జరుగుతుందని, అలా వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీ నియమాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, ఎవరైనా పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు శరత్, జీవీ రామకృష్ణ, రాంభూపాల్, గన్ రాజ్, విపుల్ గౌడ్, ప్రమోద్, శివ, రాజు, సన్నీ గౌడ్, శంకర్ తదిరులు పాల్గొన్నారు.
