25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పైనల్ కు చేరిన తరువాత గుర్తుకొచ్చిన నాన్ లోకల్

Must read

📰 Generate e-Paper Clip

 . . . కర్నాటక క్రిడాకారులకు ఘోర అవమానం

. . . పైనల్ కు చెరిన తరువాత అడించేందుకు నిరాకరణ

. . . క్రిడా స్పూర్తిని విస్మరించిన నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్

 నిజామాబాద్ , బతుకమ్మ:                                                                                                                                                        

క్రిడలు అంటే గెలుపు ఓటములు సహజం. అది ప్రతి క్రిడల సంధర్బంగా  పాల్గోనే క్రిడాకారులు కానీ ముఖ్య అతిథులుగాని చెప్పే మాటా. కానీ నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ నిర్వాకం వల్ల కర్ణాటకకు చెందిన క్రిడాకారులకు ఘోర అవమానం జరిగింది. టోర్ని నిర్వహణ వైఫల్యంను క్రిడాకారులపై చూపి క్రీడా స్పూర్తిని దెబ్బతీసారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ నిర్వాహకులు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ అధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ క్రిడలు రెండు రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో పాల్గొనడానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రిడాకారులతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుల్భార్గ కు చెందిన ఇద్ధరు క్రీడాకారులు  హబీబ్, జక్రియలు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు టోర్ని నిర్వహకులు వారికి అడేందుకు అనుమతించారు. దానితో వారు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి జిల్లాకు చెరుకున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు చేతుల మీదుగా టోర్ని ప్రారంభమయింది. ఇద్ధరు క్రిడాకారులైన హబీబ్, జక్రియ లు  45 సంవత్సరాల విభాగంలో, 40 సంవత్సరాల విభాగంలో సెమిస్ కు చెరారు. దానితో ఇతర జిల్లాల క్రిడాకారులకు హబీబ్, జక్రియ ల ఆటను చూసి భయంపట్టుకుంది. ఎక్కడ ఓడిపోతామోనని భయపడి తాము స్థానికేతరులతో కలిసి అడేది లేదని భీష్మించుకు కుర్చున్నారు. దానితో నిర్వాహకులు గుల్బర్గకు చెందిన హబీబ్, జక్రియాలను టోర్ని  నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వారు నిరాశకు గురయ్యారు. తాము హైదరాబాద్ లో గతంలో చాలా టోర్నిలు ఆడామని ఇక్కడ దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా అనుమతించి నాలుగు మ్యాచ్ లో గెలిచి ఫైనల్, సెమీ ఫైనల్ కు వచ్చిన తర్వాత స్థానికేతరులు అనడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అనుమతించకపోయినా ఇంత బాధ పడకపోయే వారమని నాలుగు మ్యాచ్ లు గెలిచిన తర్వాత నాన్ లోకల్ అనడం సబబు కాదన్నారు. ఇద్దరు క్రీడాకారులకే తెలంగాణ ప్రాంత క్రీడాకారులు మద్దతు తెలిపారు. టోర్ని నిర్వాహకులు మాత్రం తమ వైఫల్యాలను తమకు సంబంధించిన క్రీడాకారులను గెలిపించేందుకే క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.

A non local remembered after reaching the final

More articles

Latest article