29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

క్రీడాభివృద్ధి కోసం ఆధునిక స్టేడియం అవసరం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్‌లో క్రీడా అభివృద్ధి కోసం ఆధునిక స్టేడియం ఏర్పాటు అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ అర్బన్ పరిధిలో కీశే ఎంవీ.సుబ్బారావు స్మారకంగా నిర్వహిస్తున్న “నిజామాబాద్ అర్బన్ అంతర పాఠశాల క్రీడోత్సవాలు” మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.  ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, పిసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..  నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు.  గత 13 సంవత్సరాలుగా అర్బన్‌లో ఇలాంటి క్రీడా పోటీలు జరగలేదని తెలిసి విచారం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే క్రీడాకారులకు న్యాయం చేయాలని, నిజామాబాద్‌లో క్రీడా అభివృద్ధి కోసం ఆధునిక స్టేడియం ఏర్పాటు అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్‌కు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఈ స్టేడియంలో ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య, బాక్సింగ్ స్టార్ నికత్ జరీన్, ఫుట్‌బాల్ క్రీడాకారిణి సౌమ్య, బాక్సర్ హుస్సముద్దీన్ వంటి ముద్దుబిడ్డలు నిజామాబాద్ కు గర్వకారణమని పేర్కొన్నారు. భారతదేశ క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డు మన నిజామాబాద్ అర్బన్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులు నికత్ జరీన్, హుస్సముద్దీన్ అందుకోవడం మన ప్రాంతానికి గొప్ప గౌరవమని తెలిపారు. విద్యార్థులు చదువు తో పాటు, క్రీడా ప్రతిభను మెరుగుపరచడంలో ఇలాంటి క్రీడోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, జట్టు భావన, శారీరక-మానసిక వికాసానికి దారితీస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.  ఈ సందర్బంగా నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ, పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశవ వేణు,  డీఈఓ అశోక్ కుమార్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ నాగమణి, కన్వీనర్ బొబ్బిలి నరసింహా, సౌత్ ఎంఈఓ సాయి రెడ్డి కబడ్డీ ప్రశాంత్,  స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

A modern stadium is needed for the development of sports.

More articles

Latest article