క్రీడాభివృద్ధి కోసం ఆధునిక స్టేడియం అవసరం

ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్‌లో క్రీడా అభివృద్ధి కోసం ఆధునిక స్టేడియం ఏర్పాటు అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ అర్బన్ పరిధిలో కీశే ఎంవీ.సుబ్బారావు స్మారకంగా నిర్వహిస్తున్న "నిజామాబాద్ అర్బన్ అంతర పాఠశాల క్రీడోత్సవాలు" మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.  ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, పిసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...