25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజిలో కొత్తగా నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసినట్లు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.  ఏదో ఒక బలమైన ఆయుధంతో, తలపై, ఇతర శరీర భాగాలపై కొట్టి, చంపినారని అన్నారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి నర్సింలు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. అతని పేరు వివరాలు తెలుసుకోగా, సాయి అలియాస్ యేసు, వయసు సుమారు 30-40 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.


A gruesome murder by an unknown person

శుక్రవారం రాత్రి రోజులాగే అక్కడ పడుకునే ప్రాంతంలో పక్కన ఉన్న వేరొక రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలతో గొడవ జరిగిందని, వారు ఇతనిని ఏదో ఒక ఆయుధంతో కొట్టి చంపి ఉండవచ్చని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి కుడిచేతిపై “Sravanya” అని ఇంగ్లీషులో పచ్చబొట్టు, ఎడమ చేతిపై త్రిశూలం, డమరుకం, ఓం పచ్చబొట్టు ఉన్నయని తెలిపారు. అతనిని కొట్టి చంపిన వారిని పట్టుకోవడం కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, చనిపోయిన వ్యక్తి ఆచూకీ తెలుసుకోవడం కోసం మరొక టీంను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఫోటోలలో ఉన్న ఆనవాళ్లను చూసి గుర్తుపట్టిన వారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు తెలియజేయాలని కోరారు.


A gruesome murder by an unknown person

More articles

Latest article