గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజిలో కొత్తగా నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసినట్లు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఏదో ఒక బలమైన ఆయుధంతో, తలపై, ఇతర శరీర భాగాలపై కొట్టి, చంపినారని అన్నారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి నర్సింలు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. అతని పేరు వివరాలు తెలుసుకోగా, సాయి అలియాస్ యేసు, వయసు సుమారు 30-40 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. శుక్రవారం రాత్రి రోజులాగే అక్కడ...