27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మొక్కలు నాటిన యువ రైతుకు ఘన సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

  • పొలం చుట్టూరా 80 కొబ్బరి మొక్కలు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ  : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యువ రైతు పెద్దవేణి భాస్కర్ యాదవ్ తన పొలం ఇరువైపులా 80 కొబ్బరి మొక్కలను నాటినందుకు శుక్రవారం ఎంపీడీవో సత్తయ్య ఆధ్వర్యంలో నాటిన మొక్కలను పరిశీలించి ఆయనను తన వ్యవసాయ పొలం వద్ద ఘనంగా సన్మానించారు.పనుల జాతరలో భాగంగా ఆర్టికల్చర్ మొక్కలను నాటడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, మాజీ వార్డు సభ్యుడు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు గంట అంజాగౌడ్, గుర్రపు రాములు, గంట వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article