25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

  • 22 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల వసంతోత్సవం

 

భీమ్‌గల్, బతుకమ్మ :  మండలంలోని గోన్ గోప్పుల గ్రామ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల (2002-03) ఎస్.ఎస్.సి బ్యాచ్ చెందిన విద్యార్థుని, విద్యార్థులు ఆదివారం ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొన్నారు. ఇందులో భాగంగా  పాఠశాలలో వేదిక చేసుకొని తాము చదివిన పాఠశాలలో 22 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో సహా ఆనందంగా ఆత్మీయంగా కలుసుకున్నారు. విద్యార్థుల ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పూర్వ విద్యార్థులకు విద్యను బోధించిన ఉపాధ్యాయులు శ్రీనివాస్, వెంకటరమణ, కృష్ణస్వామి ఇంద్రసేనా రెడ్డి, లింబగిరి, ప్రసాద్, రాములు, వినోద్, రాజేశ్వర్, నవీన్ లను పూర్వ విద్యార్థులు ఘనంగా శాలువ,పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా  ఉపాధ్యాయులు మాట్లాడుతూ. 22 సంవత్సరాలు తర్వాత కూడా మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుంచు కోవడం చాలా  సంతోషకరమన్నారు. గురు శిష్య బంధం కుటుంబ బంధం కన్నా మహెున్నమైనదని,  విద్యార్థులు ప్రణాళికతో ముందుకు సాగి సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, వ్యాపారం, సామాజిక సేవ, సకల రంగాలలో సేవ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగులుగా రాణించి, కష్టాల్లో ఆపద్బాం ధవులుగా నిలవాలని ఆకాంక్షించారు. పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిసి బాల సంస్కృతి లో గుర్తు చేసుకున్నారు. సాయంత్రం వరకు కలిసిమెలిసి డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విద్యార్థినిలు ప్రవీణ్ గౌడ్, మూర్తి ముదిరాజ్, మజాహార్, నవీన్, ఖలీం, భూమేశ్వర్,జగన్, చంద్, జామున, సుమతి,శబాన, సుమలత, కృష్ణవేణి, శ్రీలత, గంగనర్సు, వరలక్ష్మి, సుమలత, కవిత, లక్ష్మిలు  కుటుంబ సభ్యులతో  సహా కలిసి పాల్గొన్నారు.

More articles

Latest article