25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో మంచి సీడ్ చట్టం తీసుకురావాల్సి ఉంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తూ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా కృషి చేస్తున్నారు

 

. . . రైతు కమిషన్ కార్యాలయంలో సమావేశంలో కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో మంచి సీడ్ చట్టం తీసుకురావాల్సి ఉందని, మన తెలంగాణ రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తూ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా కృషి చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం హైదరాబాద్ బీఆర్ కే భవన్ రైతు కమిషన్ కార్యాలయంలో లో రాష్ట్రంలో విత్తన పంటలు సాగు చేస్తున్న  రైతుల సమస్యలను   తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులను కలిసి కవిత వివరించారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ లతో  కలిసి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తూ ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా తెలంగాణను చేసేందుకు కృషి చేస్తున్నారని, కానీ వారికి 2007 లో పాసైన కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే చట్టం ప్రకారం ఉండాల్సిన హక్కులు ఉండటం లేదని, రైతుకు మేలు చేసే విధంగా ఆ చట్టాన్ని వాడకోవటం లేదని తెలిపారు. ముఖ్యంగా సీడ్ పత్తి రైతులకు ఇచ్చే అడ్వాన్స్ ను కూడా ఇంటరెస్ట్ తీసుకుంటూ భూములు రాయించుకుంటున్నారని, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయాధికారులు రైతుల పక్షాన నిలవటం లేదని వాపోయారు. చట్టంలో ఉన్న లోటు పాట్లను సరిచేయాల్సిన అవసరం ఉందని, చాలా మంది సీడ్ పండిస్తున్న రైతులు మన రాష్ట్రంలో ఉన్నందున మంచి సీడ్ చట్టం రావాల్సి ఉందని పేర్కొన్నారు. రైతు కమిషన్ ఛైర్మన్ గా సీడ్ పండించే రైతులకు మంచి జరిగేలా మీరే చూడాలని, కరీంనగర్ లో వరి సీడ్ పండిస్తున్న రైతులకు ఎకరానికి 75 వేలు ఇస్తున్నారని, కానీ గద్వాల్ లో సీడ్ పత్తి పండించే రైతులకు అడ్వాన్స్, ఫెస్టిసైడ్స్ కు ఇచ్చే డబ్బులకు కూడా భూమి తనఖా పెట్టించుకుంటున్నారని, పైగా 250 గ్రాముల తరుగు కూడా తీస్తున్నారని తెలిపారు. కరీంనగర్ లో వరి సీడ్ పండించే రైతులకు ప్రొక్యూర్ చేసిన తర్వాత మిగిలిన వాటిని కమర్షియల్ గా అమ్ముకునే ఫ్రీడమ్ ఉందని, కానీ గద్వాల్ లో సీడ్ పత్తి రైతులను మల్టీ లెవల్ లో మోసం చేస్తున్నారని, సీడ్ పత్తి ఆర్గనైజర్స్, మీడియేటర్లు రైతులను పట్టి పీడిస్తున్నారని పేర్కొన్నారు. ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పిన తర్వాత పంట వచ్చినా రాకపోయిన రైతులకు డబ్బులు ఇవ్వాలని, పంట రాకపోతే రైతులు పడే మానసిక ఆందోళనను కూడా పట్టించుకోవాలని చట్టంలో ఉందని, కానీ కంపెనీలు, ఆర్గనైజర్లు పట్టించుకోవటం లేదని తెలిపారు.

 

A good seed law needs to be brought in the state.

 

గద్వాల్ జిల్లాలో పరిస్థితిని మేము ప్రత్యక్షంగా చూడటం జరిగిందని, కరీంనగర్ లో వరికి ఎకరానికి 75 వేలు ఇచ్చినట్లే, గద్వాల్ లో రైతులకు కూడా ఇప్పించాలిన, సీడ్ ఇచ్చిన తర్వాత అది ఫెయిల్ అయితే దానికి రైతుకు సంబంధం ఉండకూడదని, కంపెనీ వాళ్లు ఇచ్చే సీడ్ ఫెయిల్ అయితే దానికి కంపెనీయే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. కానీ మీరు సరిగా నాటలేదంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని, పైగా గద్వాల్ జిల్లాలో 10 వేల మంది సీడ్ పత్తి రైతులకు రూ. 2 వందల కోట్లు రావాల్సి ఉందని, మీరు జోక్యం చేసుకోని రైతులకు మంచి జరిగేలా చూడాలని తెలిపారు. మోస్ట్ పాయిజన్ ఫెస్టిసైడ్స్ కూడా మన రాష్ట్రంలో బ్యాన్ కాలేదని, కనీసం వాటిని లిమిటెడ్ గా అమ్మేలా అయిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ కవిత ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేస్తున్నదని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మంచి సాంప్రదాయమని, గద్వాల్ జిల్లాలో పత్తి విత్తనాలు ఏళ్లతరబడిగా పండిస్తున్నారన్నారు. గతంలోనే ఈ సమస్య మా దృష్టికి వచ్చిందని, కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడే సమావేశం పెట్టామని, ఆర్గనైజర్ల తోనే ఈ సమస్య వస్తుందని విత్తన కంపెనీ వాళ్లకు చెప్పామని, విత్తన కంపెనీలు ఆర్గనైజర్లను అడ్డం పెట్టుకొని విత్తనోత్పత్తి చేస్తున్నారని తెలిపారు. విత్తన కంపెనీల వారు ఇచ్చే విత్తనమే రైతులు సాగుచేస్తున్నారని, రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారని, రుణమాఫీ, భరోసా,  బోనస్ ఇచ్చి రైతులకు సీఎం అండగా నిలబడ్డారని అన్నారు. ఇటీవల సీఎం తో కమిషన్ సమావేశమైనప్పుడు చాలావిషయాలు చర్చకు వచ్చాయని, పంటల మార్పిడి చేయాలని, ఇతర పంటలకు కూడా బోనస్ ఇచ్చే అంశంపై చర్చించారని, పత్తి కొనుగోలు విషయంలో కేంద్రం ఆంక్షలు పెట్టడం సరికాదని, వరి కొనుగోలు విషయంలో కూడా ఎఫ్ సిఐ ఇబ్బంది పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు రైతులకు ఇబ్బందిగా ఉన్నాయని, తెలంగాణ రాకముందు విత్తన కంపెనీలు అనుమతి కోసం వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చేవారని, కానీ గత పదేళ్లకాలంలో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. కల్తీ విత్తనాలు బాగా పెరిగాయని, విత్తనం అనేది రైతు హక్కని, మన పూర్వికులు విత్తనాన్ని కొనేవారు కాదని, కానీ ఇప్పుడు విత్తనం కొనుకొని పంటవేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. కేంద్ర విత్తన చట్టం ముసాయిదా దారుణంగా ఉందని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశామని పేర్కొన్నారు. విత్తన కంపెనీల వ్యవహారం బాగాలేదని, రాష్ట్ర పరిధిలో విత్తన చట్టం తీసుకురానున్నామని, ఆ కాపీని కూడా కవితకు ఇస్తామని తెలిపారు. తక్కువ నీటితో పంటలు వేసుకోవాలని, పంటల మార్పిడి చేసుకోవాలని చెప్పామని, దానికి మీ వంతు కూడా సహకారం కావాలని, కలుపు మందు విషయంలో కూడా రైతులను అవేర్నెస్ చేయండని అన్నారు. పసుపు రైతుల విషయంలో కూడా యంత్రపరికరాలు ఇవ్వాలని చెప్పామని, ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు, జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రైతు జాగృతి అధ్యక్షుడు నవీన్ రెడ్డి తదితరులున్నారు.

More articles

Latest article