వేల్పూర్, బతుకమ్మ :
మహిళ సంఘాల్లో సభ్యులు ఆర్థికంగా ఎదగడానికి ఈ శిక్షణ మంచి అవకాశం అని సీ సీ వెన్న మురళీ అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం టైలరింగ్, మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగ్, బ్యూటిషన్ తదితర అంశాలపై 15 రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున ఈ శిక్షణలో పాల్గొనవలసిన వారు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీలు రాధా, సరళ, శిక్షణ నిర్వాహకులు ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.
