29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

చిన్నారి పై అత్యాచారానికి యత్నించిన నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

. .  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బట్టు వెంకట్

బతుకమ్మ, మాచారెడ్డి:   

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని జీవదాన్ స్కూల్ లో చిన్నారి పై అత్యాచారానికి యత్నించిన నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్ డిమాండ్ చేశారు.  మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వెంకట్ మాట్లాడుతు… జీవదాన్ హైస్కూల్లో జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైనది.  దానిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేయడంపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. అత్యాచారానికి యత్నించిన పీఈటి నాగరాజు పై కఠినమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల సంఘీభావం తో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తి గాని లక్ష్మి,  మాచారెడ్డి మండల అధ్యక్షుడు బట్ట రమేష్, రామారెడ్డి మండల అధ్యక్షుడు రాజనర్సింహులు, రాజంపేట మండల మహిళా అధ్యక్షురాలు సుజాత, రామారెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు లావణ్య, పాల్వంచ మండల అధ్యక్షులు కొంగల భూమేష్, శ్యామ్ కొత్తూరు యాదగిరి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article